'యంజాతే అనేన ఇతి యోగాః' లక్ష్యాన్ని సాధించడానికి చేసే చర్య. యోగశిఖోపనిషత్ –12 యోగం అనేది మనలో ఉన్న ద్వంద్వత్వాల కలయిక, అనగా; ప్రాణ మరియు అపాన, రజస్ మరియు రేతలు, సూర్య మరియు చంద్ర నాడీలు, జీవాత్మ మరియు పరమాత్మ. ద్వంద్వాల కలయికను యోగం అంటారు
యుజ్" అనగా "కలయిక" అనే సంస్కృత ధాతువు నుండి "యోగ" లేదా "యోగము" అనే పదం ఉత్పన్నమైంది. "యుజ్యతేఏతదితి యోగః", "యుజ్యతే అనేన ఇతి యోగః" వంటి నిర్వచనాళ ద్వారా చెప్పబడిన భావము - యోగమనగా ఇంద్రియములను వశపరచుకొని, చిత్తమును ఈశ్వరుబియందు లయం చేయుట. మానవిని మానసిక శక్తులన్నింటిని ఏకమొనర్చి సామాన్య స్థితిని చేకూర్చి భగవన్మయమొనరించుట. ఇలా ఏకాగ్రత సాధీంచడంవలన జీవావధులను భగ్నం చేసి, పరమార్ధ తత్వమునకు త్రోవచేసుకొని పోవచ్చును. అలా ఆత్మ తనలో నిగూఢంగా ఉన్న నిజ శక్తిని సాధిస్తుంది. ఇలా ఆంతరంగికమైన శిక్షణకు భిన్న మార్గాలున్నాయి.వాటిని వివిధయోగ విధానాలుగా సూత్రకారులు విభజించారు
అలసట, ఆందోళన, ఒత్తిడి, తీవ్ర ఒత్తిడి (హైపర్ టెన్షన్), ప్రతి దానికి ఒత్తిడికి గురవటం..... మాటలేమో ఎదుటివారితో, ఆలోచనేమో మరెక్కడో, ప్రతిదానికి విసుగు, కోపం.... వీటితో లెక్కకు మించిన అనారోగ్యాలు....... అలాంటి టెన్షన్‌సను తగ్గించుకుని శరీరాన్ని, మనసును ఓ దగ్గర ఉంచుకోలేకపోవటం, మనసు మీద పట్టులేకపోవటం. ఇలాంటి వాటిని అధిగమించడానికి పూర్వం మహర్షులు, సిద్ధులు, యోగులు భరత ఖండంలో చక్కటి దారి చూపించారు. మానసిక పరమైన వ్యాధులను తగ్గించేందుకు అష్టాంగ యోగ పద్దతులతో పాటు అంతకుముందు కొన్ని ప్రాచీన యోగ పద్దతులను కూడా పాటించేవారు.